ప్రియులారా, మనము ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, తిరిగి ఏమి తీసుకొని వెళ్ళము. ఈ లోకంలోనికి ఏవిధంగా వచ్చినామో, తిరిగి అదే విధంగా వెళ్లిపోతాము. అయితే మన పాపములు మన వెంట వస్తాయి. పాపము లేని మనిషి ఒక్కడు కూడా లేడు. ప్రతి మానవునికి జన్మ, కర్మ పాపాలు ఉన్నాయి. ఈ పాపములతో మనిషి మోక్షం చేరలేడు.
మరణం తరువాత రెండే రెండు స్థలాలు ఉంటున్నాయి: పరలోకం - పాతాళం. ఈ రెంటిలో ఏదో ఒక స్థలంలో మానవుడు యుగాయుగాలు గడపవలసి ఉన్నది. చనిపోయిన తర్వాత నీ స్థలమెక్కడ? నరకం అంటే అది ఆరని అగ్నిగుండం. అందులో పడినవారు ఎన్నడూ బయటకు రారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉంటుంది, రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదు.
అయితే దేవుడు ప్రేమగలవాడు. మహా భయంకరమైన ఆ నిత్యత్వంలో ఎవ్వరూ ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలోనికి శరీరం ధరించుకొని వచ్చాడు. ఇది చరిత్ర సత్యం, ఎవ్వరూ కాదనలేరు.
మన పాపములకోసం మనకు రావలసిన శిక్ష, మనకు బదులుగా ఆయనే సిలువలో భరించినాడు. చేతులలో మేకులు, కాళ్లలో మేకులు, తల మీద ముళ్ళకిరీటం, ప్రక్కలో బళ్లెపు పోటు, ఈవిధంగా శ్రమలు పొంది, శరీరమంతా కొరడా దెబ్బలు తిని, ఆయన మానవాళి కోసం సిలువలో ప్రాణం పెట్టియున్నాడు. చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచినాడు. ఆ లేచిన యేసునందు విశ్వాసము ఉంచడం ద్వారా, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు.
యేసు అన్నాడు, "నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకంలో చేరరు." ఇదే మీకు శుభవార్త.
Pastor Jeevarathnam has been in the ministry for over 50 years now. He first worked as an evangelist in various parts of the country for about 9 years. Then in obedience to the call of God He stepped into pastoral ministry. He now serves as a senior pastor at Clavary Gospel Church, Godavarikhani.