logo
logo

శ్రమలను గూర్చి జాన్ కాల్విన్

మనం ఈ లోకానికి అతుక్కుపోకుండా ఉండడానికి, దేవుడు తగిన పరిస్థితులను ఉపయోగిస్తాడు.

  • Article by John Calvin (1509 – 1564)
    December 8, 2021
  • మనలను బాధించే శ్రమ ఎటువంటిదైనా, దేవుడు మన జీవితాల్లో వాటిని అనుమతించడానికి గల కారణం ఒక్కటే. ‘వాటి ద్వారా మనలో ఈ లోకం మీద ద్వేషాన్ని మరియు రాబోయే జీవితం పైన ఆశను దేవుడు కలిగిస్తాడు’. శ్రమల ద్వారా ఇలాంటి శిక్షణ మనలో జరుగుతుంది.

    మన హృదయ స్థితి

    మన హృదయాలు ఈ లోకం వైపుకు ఎంత బలంగా త్రిప్పబడి ఉన్నవో దేవునికి బాగా తెలుసు. కాబట్టి, మనం ఈ లోకానికి అతుక్కుపోకుండా ఉండడానికి, అయన తగిన పరిస్థితిని ఉపయోగించి మనలను తన వైపుకు పిలుస్తాడు, తత్ఫలితంగా మన నిద్రమత్తును తొలగిస్తాడు.

    వాస్తవానికి, మనలో ప్రతిఒక్కరు పరలోకసంబంధమైన అమరత్వాన్ని ఆశించాలి. అంతేకాదు, తమ జీవితకాలమంతా దానినే లక్ష్యంగా  ఉంచుకొనుటకు ఆలోచన కలిగిఉంటారు. ఎందుకంటే, ఒకవేళ మరణించిన తర్వాత జీవితం అనేదే లేనట్లయితే, జంతువుకి మానవులకు వేత్యాసముండేది కాదు. మరియు, వాటికంటే ప్రత్యేకమైన అతిశయకారణం లేకుండా సిగ్గుపరచబడేవారము. మనిషి యొక్క ఘనత అదే కాబట్టి మనిషి పరలోకపు అమరత్వము పైన దృష్టి ఉంచాలి.

    కానీ, మనుషుల క్రియలు, ప్రణాళికలు మరియు కోరికలు గమనిస్తే అందులో భూలోకము తప్ప మరేమి ఉండదు. ఇదీ... మన బుద్ధిహీనత. ధనము, అధికారము, ఘనత అనేవి గొప్ప ప్రకాశంతో మన మనస్సులను కమ్మివేసి దూరదృష్టి లేకుండా చేసాయి. హృదయము కూడా,అత్యాశ, వాంఛ మరియు మోహము అనేవాటిచేత ఆక్రమించబడి జయించలేనంతగా అణగద్రొక్కబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆత్మంత శరీరేచ్ఛలో చిక్కుకొని ఇహలోకంలో తన ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది.

    దేవుని కార్యము

    ఈ వ్యాధిని నివారించడానికి, ప్రభువు ఇహలోకంలో ఉండే కష్టాలను ఉపయోగించి ప్రస్తుత జీవితం ఎంత వ్యర్థమైందో తన ప్రజలకు రుజువు పరుస్తూ ఉంటాడు.  ఎలాగంటే శాశ్వతమైన శాంతి ఈ లోకంలోనే దొరుకుతుందేమోనని వారు ఆశించకుండా ఉండటానికి, తరచుగా యుద్ధ దాడులను, దోపిడీలను లేదా విశ్రాంతిలేకుండా చేసే గాయాలను అయన వారికీ అనుమతిస్తాడు.

    అలాగే, వాడిపోయే ధనాన్ని ఆసక్తితో ఆశించకుండా లేదా ఇదివరకే ఉన్న ఆస్తులపైన ఆధారపడకుండా చేయడానికి అయన వారిని అసంతృప్తిలో ఉంచుతాడు. పరదేశులుగా చేయడం ద్వారానో లేదా సంతానలేమి ద్వారానో లేదా అగ్ని సంఘటన ద్వారానో ఇలా వివిధ మాధ్యమాల ద్వారా వారు తమ ఆస్తిని అనుభవించకుండా కట్టడిచేస్తాడు.

    అంతేకాకుండా, వారి దాంపత్య సంతోషాల్లో వారు మునిగిపోకుండా ఉండటానికి, అయన వారిని తమ భాగస్వామి యొక్క దుష్ప్రవర్తన ద్వారా విసుగుపరుస్తాడు, లేదా కొన్నిసార్లు తమ పిల్లల దుష్టత్వము ద్వారా వారి గర్వాన్ని తగ్గిస్తాడు, లేదా ఎవరినైనా మరణానికి అప్పగించడం ద్వారా అయన వారిని బాధిస్తాడు.

    ఒకవేళ వారికి సమృద్ధిని  మరియు సంతోషాన్ని ఇచ్చినా, వారు వృధా అతిశయమతో  ఉప్పొంగిపోకుండా ఉండడానికి, లోకంలో ఉండే వ్యాధులద్వారా లేదా ప్రమాదాలద్వారా, వారికి  ఉన్నవన్నీ నిలకడలేనివని అస్థిరమైనవని అయన వారికి స్పష్టంగా బయలుపరుస్తాడు.

    మన స్పందన

    కాబట్టి, మనం మనము సిలువయొక్క క్రమశిక్షణను (శ్రమల ద్వారా శిక్షణను) సరిగా అర్ధం చేసుకోవడం  ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఈ లోకసంబంధమైన జీవితము నెమ్మదిలేనిదని, శ్రమతోకూడినదని, దౌర్భాగ్యమైనదని, ఒక్కమాటలో చెప్పాలంటే ఏవిషయంలోనూ సంతోషకరమైంద కాదని నేర్చుకుంటామో, అప్పుడే సిలువయొక్క క్రమశిక్షణ ద్వారా లాభంపొందగలం. ఏవైతే ఆశీర్వాదాలుగా అంచనా వేసామో వాస్తవానికి అవే నమ్మదగనివని, నిలకడలేనివని, నిశ్ఫలమైనవని మరియు బలహీనపరచేవని తెలుసుకోవాలి.

    సారాంశం ఏంటంటే, 1. ఈ లోకంలో మనం చూసేదల్లా పోరాటం మాత్రమే. 2. మనము కిరీటంగూర్చి ఆలోచించి మన కన్నులు పరలోకంవైపు ఎత్తాలి. 3. ఎందుకంటే, మన మనస్సు ఈ లోకాన్ని ద్వేషించలేకపోతే నిత్యజీవితాన్ని ఆశించడం అసాధ్యం. ఈ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి.

    John Calvin (1509 – 1564) is a pastor, theologian and reformer in Geneva during the Protestant Reformation. He authored many books including Institutes of the Christian Religion.

    Popular
    Books
  • John Bunyan (1628 – 1688)
  • యాత్రికుని ప్రయాణం

    ఆత్మీయ పోరాటమును, ప్రయాణమును, జాన్ బణ్యన్ గారు ఈ పుస్తకంలో అద్భుతముగా వివరించారు
    Sermon
  • Joseph Livingston
  • దేవుని లక్ష్యం

    Sermon
  • Paulson Vasala
  • ఆత్మలో మూలుగుచు మహిమ కొరకు నిరీక్షించుచు

    Life Eternal
    Unto God be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.
    Contact Us | +91 9573331717All Rights Reserved.